ELR: జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఇవాళ మీడియాతో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమన మాట్లాడుతూ.. ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటీకరణ చెయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. నియోజకవర్గలోని వైసీపీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొనాలని తెలిపారు.