NLR: నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, మొంథా తుఫాను సమయంలో విశేష సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులను శుక్రవారం అభినందించారు. వారి సేవలను కొనియాడుతూ, పండ్లు పంపిణీ చేశారు. తుఫాను సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నిరంతరం విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని కమిషనర్ నందన్ ప్రశంసించారు.