APL మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 1,150 మంది కుటుంబాలకు రూ.46 కోట్ల నిధులు విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనుంది. బాధిత న్యాయవాదికి సంబంధించి నామినీకి ఆర్థికసాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ పేరుతో నిధుల జారీకి ఆదేశించింది.