రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ్టి నుంచి అంగోలా, బోట్స్వానా దేశాల్లో పర్యటించనున్నారు. ఆఫ్రికా ఖండంతో భారతదేశ అభివృద్ధి భాగస్వామ్యాన్ని విస్తరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. అంగోలాకు స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకల్లో పాల్గొంటారు. ఆ దేశ అధ్యక్షడు జోనో మాన్యుయెల్ గోన్సాల్వేస్ లౌరెన్కోతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారు.