KDP: కాశినాయన మండలంలో రైతులు పొలాలకు విద్యుత్ కంచెలు వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై యోగేంద్ర తెలిపారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంత గ్రామాల్లో డప్పు ద్వారా హెచ్చరికలు జారీ చేశారన్నారు. అయితే విద్యుత్ కంచెల వల్ల జంతువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదం కలగవచ్చని ఆయన హెచ్చరించారు.