KDP: సీఎం సహాయనిధి (CMRF) పేదలకు వరం లాంటిది అని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. గురువారం అట్లూరు మండలం కొండూరుకు చెందిన బోవిళ్ల చంద్రారెడ్డికి రూ.25,000, అట్లూరుకు చెందిన దున్నోతుల ఎల్లారెడ్డికి రూ.47,327 విలువైన CMRF చెక్కులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక సమస్యల వల్ల పేదలు వైద్యపరీక్షలకు దూరం కాకుండా చూడడానికి సీఎం చంద్రబాబు ఈ నిధులను ఇస్తున్నారని ఆమె తెలిపారు.