ప్రకాశం: దివ్యాంగులకు ఉచితంగా 1,750 రెట్రోఫిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు,టెన్త్ పాసై స్వయం ఉపాధితో జీవించే వాళ్లు,18-45 ఏళ్లలోపు వయస్సు ఉండి 70% అంగవైకల్యం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.ఈనెల 25లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.