NLR: ఉలవపాడు హైవేపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అలగాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొందరు మహిళలు మంత్రి నారా లోకేశ్‌ను కలవడానికి ఆటోలో బయల్దేరారు. ఉలవపాడు బైపాస్ వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడటంతో ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. మరి కొంత మందిని ఉలవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.