కోనసీమ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు అధికారులు మిల్లర్ల సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. బుధవారం మండపేట మండల పరిధిలోని ఏడిద గ్రామపంచాయతీ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, జిల్లా సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్‌తో కలసి ప్రారంభించారు.