NLG: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును ఇవాళ చిట్యాల మండల బీఆర్ఎస్ నేతలు వారి నివాసంలో పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతికి సంతాపం తెలిపి, నివాళులు అర్పించారు. పరామర్శించిన వారిలో నాయకుడు కొలను వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ దశరథ, మేడి ఉపేందర్, నాగరాజు, శివకుమార్, భాస్కర్ ఉన్నారు.