ప్రకాశం: ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేట శివాలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల చేత పూజలు నిర్వహించి, తరువాత తీర్థప్రసాదాలు అందజేశారు.