WGL: రాయపర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో జోనల్ స్థాయి క్రీడా టోర్నమెంట్ ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ సముద్రాల సరిత ఆధ్వర్యంలో పీడీలు, పీఈటీలు క్రీడా మైదానాలను ముస్తాబు చేస్తున్నారు. నవంబర్ 6 నుంచి 8 వరకు జరిగే ఈ పోటీల్లో మొత్తం 1,190 మంది విద్యార్థినులు వివిధ క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.