ELR: మండవల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా కె. రమణబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కృష్ణా జిల్లా పరిషత్లో ఏవోగా పనిచేసిన ఆయన, పదోన్నతిపై మచిలీపట్నం నుంచి మండవల్లికి బదిలీ అయ్యారు. దీంతో ఇంఛార్జ్ ఎంపీడీవో రామలింగేశ్వరరావు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సిబ్బంది నూతన MDOకు స్వాగతం పలికారు.