TPT: తిరుపతి నగరంలోని గిరిపురంలో మంగళవారం వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలకు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సంతకాలను సేకరించారు. అనంతరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వల్ల జరిగే ఇబ్బందులను ప్రజలకు వివరించారు.