టాలీవుడ్(Tollywood)లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల జోరు ఎక్కువవుతోంది. క్రైమ్ థ్రిల్లర్స్ సినిమాల(Crime Thriller Movies)కు ఆదరణ పెరుగుతోంది. ఆ తరహా కంటెంట్‌ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. దీంతో మేకర్స్ కూడా అటువంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కొత్త పాయింట్‌ను టచ్ చేస్తే చాలు భారీ వసూళ్లను సినిమా రాబడుతోంది.
హసీనా మూవీ ట్రైలర్:
తాజాగా ఇటువంటి కథా నేపథ్యంతో తెరకెక్కిన సినిమా హసీనా (Haseena Movie). ప్రియాంక డే ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందింది. తన్వీర్, సాయి తేజ గంజి, శివగంగ వంటివారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తన్వీర్ నిర్మించారు. నవీన్ దర్శకత్వం(Director naveen) వహించారు. హసీనా మూవీకి నవనీత్ చారి మ్యూజిక్ అందించారు.
తాజాగా హసీనా మూవీ(Haseena Movie)కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ హసీనా మూవీ పోస్టర్స్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే హీరో అడివి శేష్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా మరో హీరో నిఖిల్ పాటను విడుదల చేశారు. హసీనా మూవీ టీజర్ (Haseena Teaser) అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీని మే 19వ తేదిన రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.