ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక గార్లపేట రోడ్డులో నివాసం ఉంటున్న సుబ్బులు అనే మహిళను అదే ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తి శనివారం కత్తితో గాయపరిచాడు. కూరగాయలు అమ్ముకుంటున్న సుబ్బులను పండ్ల వ్యాపారి అయిన శివ అనే వ్యక్తి వ్యక్తిగత కారణాలతో గాయపరిచారని స్థానికులు చెబుతున్నారు. గాయపడ్డ మహిళను కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.