AP: కాశీబుగ్గ ఘటనపై YCP నేత భూమన కరుణాకర్ స్పందించారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలో నిర్లక్ష్యం ఉందన్నారు. 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నా.. కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని తెలిపారు.