నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘ప్యారడైజ్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో హాలీవుడ్ యాక్టర్ ర్యాన్ రేనాల్డ్స్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కీలక పాత్ర కోసం ఆయనను మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ‘డెడ్‌పూల్’ మూవీతో ఆయన ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రం 2026 మార్చి 26న పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్, స్పానిష్లోనూ విడుదలవుతుంది.