PDPL: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యతను పెంపొందించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం, కలెక్టరేట్ IT ప్రాంగణం నుంచి చౌరస్తా వరకు నిర్వహించిన 2 కి.మీ. ‘యూనిటీ ఫర్ రన్’ ర్యాలీని ఆయన ప్రారంభించారు.