పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో కొరియన్ నటుడు డాన్ లీ భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన విలన్ పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక పోలీస్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి కీలక పాత్ర పోషించనున్నారు.