VZM: మొంథా తుఫాన్ ప్రభావంతో తెర్లాం మండలం ఆమిటిలో పెంకితుల్లు గోడ కూలిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడ కూలాడంతో పైకప్పు కూడా కూలింది. కూలిన సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇల్లు కూలిపోవడంతో ఇంటి యాజమాని తిరుపతి రావు, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.