BDK: మణుగూరు పట్టణ కేంద్రంలో సాయిబాబా టెంపుల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్‌తో వస్తున్న లారీ రోడ్డు డివైడర్‌ను గుద్ది బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.