ADB: ఉట్నూర్‌లోని ప్రభుత్వ సీహెచ్‌సీని బుధవారం ప్రపంచ బ్యాంకు సభ్యులు ఎస్. కృష్ణ, రంజన్ బి వర్మ, అనికేత్ ఘన్ శ్యామ్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ జాదవ్ ఉపేందర్, నోడల్ అధికారి డా. కపిల్ నాయక్, ఆర్ఎంఓ మహేందర్ సిబ్బంది ఉన్నారు.