BHPL: మొంథా తుఫాను ప్రభావంతో భద్రతా చర్యల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అక్టోబర్ 30 గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. వాతావరణ హెచ్చరికలు పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు.