SKLM: రణస్థలం మండలం నారువ పంచాయతీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జీరు గురు నాయుడు రెడ్డి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం ఆయన స్వగృహం లో పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.