MHBD: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బతికున్న వ్యక్తి రాజును మరణించినట్లు భావించి మార్చురీకి తరలించిన ఘటన గురువారం సంచలనం రేపింది. ఇవాళ సమాచారం తెలుసుకున్న MLA మురళీ నాయక్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించి, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, కలెక్టర్కు విచారణ ఆదేశించి సస్పెండ్ చేయాలని సూచించారు.