»Ibm Employee Is In Sick Leave For 15 Years Sues Compnay For No Salary Hike
IBM : 15ఏళ్లు సెలవులో ఉండి.. శాలరీ పెంచలేదని కంపెనీకి కోర్టుకు లాగాడు
కొందరికి తెలివి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. వీరు తమకంటే తోపులు ఎవరు లేరని భావిస్తుంటారు. అలా అనుకొనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఖంగుతిన్నాడు. ఐబీఎం ఉద్యోగి అయిన ఇయాన్ క్లిఫర్డ్కు సంబంధించిన స్టోరీ ఇది. అతడు 2008 నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. అతనికి కంపెనీ రూల్స్ ప్రకారం సాలరీ అందుతూనే ఉన్నది.
IBM : కొందరికి తెలివి ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. వీరు తమకంటే తోపులు ఎవరు లేరని భావిస్తుంటారు. అలా అనుకొనే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఖంగుతిన్నాడు. ఐబీఎం ఉద్యోగి అయిన ఇయాన్ క్లిఫర్డ్కు సంబంధించిన స్టోరీ ఇది. అతడు 2008 నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. అతనికి కంపెనీ రూల్స్ ప్రకారం సాలరీ అందుతూనే ఉన్నది. కానీ, తనకు వస్తున్న జీతం పెంచడం లేదని కంపెనీని కోర్టుకు ఈడ్చాడు. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2013 నుంచి మెడికల్లీ రిటైర్డ్. డిజేబిలిటీ డిస్క్రిమినేషన్‌కు తాను బాధితుడినని అతను చెప్పుకుంటున్నాడు. 15 ఏళ్లుగా తనకు కంపెనీ ఇస్తున్న జీతంలో హైక్ లేదని పేర్కొంటున్నాడు. ఐబీఎం కంపెనీ ప్లాన్ ప్రకారం, ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఏడాదికి 54 వేల పౌండ్లకు మించి జీతం అందుకుంటున్నాడు. ఆయనకు 65 ఏళ్లు నిండే వరకు ఇలా జీతం వస్తూనే ఉంటుంది. అలా హెల్త్ ప్లాన్ ఉండటమే గొప్ప. కానీ, ఆ ఉద్యోగి మాత్రం ఆ ప్లాన్ సరిగా లేదని, ద్రవ్యోల్బణంతో తన జీతం రాను రాను విలువ తగ్గిపోతుందని వాదిస్తున్నాడు.
ఇయాన్ క్లిఫర్డ్ 2008 సెప్టెంబర్‌లో సిక్ లీవ్ పై వెళ్లాడు. 2013 వరకు ఆయన సిక్ లీవ్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత తన బాధను చెప్పుకున్నాడు. ఆయన కంప్లైంట్ ఆధారంగా ఐబీఎం ఆయనకు కంప్రమైజ్ అగ్రిమెంట్ ఆఫర్ చేసింది. దీని ప్రకారం, ఆయనను కంపెనీ డిజేబిలిటీ ప్లాన్ కిందకు తీసుకొచ్చి డిస్మిస్ చేయకుండా ఉంచింది. ఆయన వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జీతం కూడా యాక్టీవ్ గా ఉన్నప్పుడు వచ్చే సాలరీలో 75 శాతం ఇస్తారు. అప్పుడు ఆయన జీతం 73,037 పౌండ్లు. 2013 నుంచి 25 శాతం కోతతో 54,028 పౌండ్లు ఆయనకు కంపెనీ చెల్లిస్తోంది. కానీ, దీనిపైనా ఆ ఉద్యోగి కంపెనీని కోర్టుకు తీసుకెళ్లాడు.ఈ పిటిషన్ విచారించిన జడ్జీ హౌస్గో విచారిస్తూ.. యాక్టివ్‌గా ఉండి వర్క్ చేస్తున్న ఉద్యోగులకు జీతం పెరుగుతుందని, పనిలో లేని ఉద్యోగికి జీతం పెంచడం కుదరని తెలిపారు.