AP: మొంథా తీవ్ర తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు బృందాలను పంపాలని సీఎం ఆదేశించారు. రాత్రికి తుఫాన్ తీరాన్ని దాటనుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కాలువలు వెంటనే పునరుద్ధరించాలన్నారు. పంట నష్టంపై కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.