ATP: తాడిపత్రిలోని పెద్దమ్మ ఆలయంలో ఉన్న త్రిశూలాన్ని మంగళవారం కొంత మంది మందుబాబులు పెరికి పక్కన పడేశారు. మందుబాబులకు త్రిశూలం అడ్డంగా ఉందనే సాకుతో తొలగించారని పలువురు అన్నారు. ఈ విషయంపై ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిశూలాన్ని పెరికిన మందుబాబుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.