TG: ఫ్యూచర్ సిటీలో సినీ ఇండస్ట్రీకి స్థలాలు కేటాయిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘సినీ కార్మికుల పిల్లల కోసం స్కూల్స్ నిర్మిస్తాం. మీ కష్టాలన్నీ తీరుస్తానని చెప్పను.. చేయగలిగినంత చేస్తా. టికెట్ల ధరలు పెంచితే.. అందులో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలి. అలా చేస్తేనే టికెట్లు పెంచేందుకు అనుమతి ఇస్తాం. కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం’ అని పేర్కొన్నారు.