HYD: సుల్తాన్ బజార్ పరిధిలోని ENT ఆసుపత్రి ఎదుట పదేపదే డ్రైనేజీ సమస్య తలెత్తుతున్నట్లు అక్కడికి వెళ్లిన రోగులు తెలిపారు. వైద్యం కోసం క్యూ లైన్లలో నిలబడితే ఒక్కోసారి రోడ్డు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుందని, దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. అధికారిక యంత్రాంగం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.