GDWL: తుఫాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, రైతులు నష్టపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను మంగళవారం ఆదేశించారు. రైతులు తమ ఆరబెట్టిన ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.