ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్‌కు వెళ్లిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్తో హాలీవుడ్ రేంజ్‌లకు వెళ్లారు. అంతేకాదు ఆస్కార్ రేసులో రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అందుకే జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కమిట్ అయ్యాడు రాజమౌళి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ తప్పితే.. ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. దాంతో ఎస్ఎస్ఎంబీ 29 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది.. మహేష్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తూ.. అభిమానులకు కిక్ ఇస్తున్నాడు. ఇప్పటికే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయబోతున్నానని చెప్పుకొచ్చాడు రాజమౌళి. అలాగే ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్టు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇక తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో కూడా అంచనాలను పెంచేసేలా.. మరోసారి అలాంటి కామెంట్స్ చేశాడు జక్కన్న. టాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నానని, ఇండియానా జోన్స్ తరహాలో సాగే భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చెప్పుకొచ్చారు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్‌లో పెరిగిపోతున్నాయి. ఇదే ఇప్పుడు త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై ఒత్తిడి పెంచేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను ఎస్ఎస్ఎంబీ 28.. రాజమౌళి సినిమాకు రీచ్ అయ్యేలా ఉండాలంటున్నారు. ఇప్పటికే స్క్రిప్టు విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి. అందుకే రాజమౌళి కామెంట్స్ మాటల మాంత్రికుడిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయంటున్నారు. ఏదేమైనా రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.