GDWL: ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అయిజ పట్టణంలోని దుర్గా నగర్ కాలనీలో సోమవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 73 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. సీజ్ చేసిన వాటిలో 68 బైకులు, 2 త్రీ వీలర్ ఆటోలు, 3 ఫోర్ వీలర్ వాహనాలు ఉన్నాయి. సరైన ధ్రువపత్రాలు చూపించి వాహనాలను తీసుకెళ్లాలని డీఎస్పీ వాహనదారులకు సూచించారు.