W.G: పాలకొల్లు పట్టణంలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరామలింగేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని వేలాది సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు.