KNR: బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరుతూ బీసీ ఆజాద్ ఫెడరేషన్, పద్మశాలి సంఘం నాయకులు ఆదివారం హుజురాబాద్లో మహాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంలో నాయకులు కుడికాల భాస్కర్, సంగెం సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడానికి ప్రభుత్వ, విపక్షాలు చిత్తశుద్ధి చూపాలని వారు డిమాండ్ చేశారు.