VSP: తుఫాన్ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లో నం. 0891-2590102, 0891-2590100 ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు నిషేధించారు.