VZM: తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య కోరారు. విజయనగరంలో ఏర్పాటుచేసిన 2 పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. మయూరి జంక్షన్ సమీపంలో ఉన్న లార్డ్ కేచనరీ పాఠశాలను, మంగళ వీధిలో ఉన్న పాఠశాలను పునరావస కేంద్రాలుగా ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిని సందర్శించి సిబ్బందికి తగు సూచనలు చేశామన్నారు.