Karnataka:కర్ణాటక అసెంబ్లీ ఓట్ల లెక్కింపు (Karnataka Assembly Election Results) ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్ కావడంతో వీటిని సెమీ ఫైనల్స్‌గా చూస్తారు. మరోవైపు జోరుగా బెట్టింగ్ (Betting ) కూడా జరుగుతున్నాయి.
హొన్నాళ్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శాంతనగౌడ, బీజేపీ నుంచి రేణుకాచార్య బరిలో నిలిచారు. వీరి గెలుపుపై జోరుగా పందాలు జరుగుతున్నాయి. నాగణ్ణ అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి (congress) గెలుస్తారని.. తనకు ఉన్న రెండెకరాల పొలం (2 acre land) పందెం కాశాడు. తనతో పందెం కాసేవారు ముందుకురావాలని డప్పు కొట్టి చాటింపు వేయించాడు. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కొండసీమల చామరాజనగర జిల్లాలో జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. సోమణ్ణ గెలుస్తారని కోటి రూపాయల వరకు పందెం కాసినట్టు తెలిసింది. గుండ్లుపేట తాలూకా మల్లయ్యనపురకు చెందిన కిరణ్ రూ.3 లక్షలతో (3 lakhs) పందెం కాశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వచ్చారు.