BHPL: గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ పోలీస్ అమరవీరుల స్మారకాన్ని పురస్కరించుకొని SI షా ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ముందు జాగ్రత్తలు, తక్షణ చర్యలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. షా ఖాన్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.