KNR: కరీంనగర్ రాఘవేంద్రనగర్‌లో నివాసముంటున్న వడ్లకొండ లక్ష్మీరాజం (64) అనే వృద్ధుడు, పొరుగువారు, బల్దియా అధికారుల వేధింపులకు మనస్తాపం చెంది శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. తన చావుకు కారణాలు వివరిస్తూ ఆయన రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.