YCP MP Margani Bharat Car Hit Retired Veterinary Doctor, Died
Margani Bharat Car Hit:రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ మార్గాని (Margani Bharat) భరత్ కారు ఢీ కొని రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ (Retired Veterinary Doctor) మృతిచెందాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట సమీపంలో గల జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. మృతుడు శృంగవృక్షం నర్సయ్యగా (narsaiah) పోలీసులు (police) గుర్తించారు.
ఆ కారు మార్గాని భరత్ (Margani Bharat) కుటుంబ సభ్యుల కారు అని తెలిసింది. కారు నల్లజర్ల వైపు నుంచి విజయవాడ వస్తుందని పోలీసులు తెలిపారు. సీతంపేట సమీపంలో ప్రమాదం జరిగిందని వారు వివరించారు. బైక్పై రోడ్డు దాటుతున్న నర్సయ్యను కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నర్సయ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
మార్గాని భరత్ కుటుంబ సభ్యుల (Margani Bharat) కారును పోలీసు స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో ఎంపీ మార్గాని భరత్ కారులో లేదని పోలీసులు తెలిపారు. కారులో ఎంపీ ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.