JGL: రాయికల్ పట్టణంలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ‘మన రాయికంటి వాట్సాప్ గ్రూప్’ సభ్యులు శనివారం పశుసంవర్ధక శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు.