ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’.. రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ అవడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 8న ఈ చిత్రం రష్యాలో విడుదల కాబోతుంది. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగే స్పెషల్ ప్రీమియర్ షోల కోసం చిత్ర యూనిట్ కూడా వెళ్లనుంది. బన్నీ-సుకుమార్ కూడా అటెండ్ అవనున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. పుష్ప రష్యన్ లాంగ్వేజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అయితే ట్రైలర్ కోసం కూడా రష్యన్ భాషలో డైలాగ్స్ చెప్పించారు. దాంతో అక్కడ పుష్ప క్రేజ్ గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగుతో పాటు మిగతా భాషల్లో పాపులర్ అయిన తగ్గదే లే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్.. పార్టీ లేదా పుష్ప.. లాంటి డైలాగ్స్, రష్యన్ భాషలో భలేగా ఉన్నాయి. మన వాళ్లకు ఆ డైలాగ్స్ తెలుసు కాబట్టి.. ఈ ట్రైలర్‌ను ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు.
ఇక రష్యన్ వెర్షన్ రిలీజ్‌తో ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సీక్వెల్ పై భారీ హైప్ రానుందని చెప్పొచ్చు. సుకుమార్ రష్యాలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇదేనని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అందుకు తగ్గట్టే సుకుమార్ భారీ బడ్జెట్ మరియు స్టార్ క్యాస్టింగ్‌తో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇక రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫజిల్.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.