SRPT: హుజూర్ నగర్ పట్టణ కేంద్రం టీచర్స్ కాలనీలోని ఆర్చి వద్ద ఎన్ఎస్పీ కెనాల్ పై నిర్మించిన వంతెనకు రంద్రం పడి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. మరికొన్ని రోజులు ఇదే నిర్లక్ష్యం వహిస్తే పాదచారులు, వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అధికారులు వెంటనే స్పందించి ఎన్ఎస్పీ కెనాల్ పై నిర్మించిన వంతెనకు మరమ్మత్తులు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.