Hyderabad : రూ.3 లక్షలిస్తే చాలట.. ప్రభుత్వ భూములు మీవేనట.. RI సస్పెండ్
ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(RI) పరమేశ్వర్రెడ్డిని సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకోవాలని ఆక్రమణలకు ప్రోత్సహించినందుకుగాను చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కలెక్టర్. రూ.3 లక్షలు ఇస్తే అనుమలు ఇస్తానని జనాలను ప్రోత్సహించినట్లు తేలింది. మే 1, 2023న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పరమేశ్వర రెడ్డిపై కలెక్టర్ కు కొందరు వ్యక్తుల ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై కలెక్టర్ విచారణ చేయించగా ఆరోపణలన్నీ నిజాలని తేలాయి. అవినీతిపై సాక్ష్యాలు లభించడంతో పరమేశ్వర రెడ్డిని సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు కలెక్టర్ . ఇతనితో పాటు మరే అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పరమేశ్వర రెడ్డి మేడ్చల్ – మల్కాజ్ గిరి కలెక్టరేట్ లో పనిచేసిన పరమేశ్వరరెడ్డి 18 నెలల క్రితం కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో అప్పటికే ఉన్న ఆక్రమణలపై ఆరాతీసిన పరమేశ్వరరెడ్డి మరికొంతమంది కూడా ఆక్రమించుకోడానకి రెడీగా ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని పిలిచి తనకు రూ.3 లక్షలు ఇస్తే అనుమతులు ఇస్తానన్న సంకేతాలను ఇచ్చాడని తెలుస్తోంది. అప్పటికే ఒకటి, రెండు ఫ్లోర్లు అక్రమంగా కట్టుకున్న వారి దగ్గరకు వెళ్లి రూ.3 లక్షల చొప్పున వసూలు చేసారని, తన సిబ్బందికి రూ.1.5 లక్షల చొప్పున పంపిణీ చేశారని విచారణలో వెళ్లడైంది.
డిసెంబర్ 2021నుంచి గాజులరామారంలోని పలు సర్వే నెంబర్ లలోని ప్రభుత్వ భూముల్లో 2,500మంది ఇళ్లు, గుడిసెలు వేసి 60 నుంచి 100 గజాల చొప్పున ఆక్రమించుకున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. అక్రమదారుల వద్దకు వెళ్లి డబ్బు ఇవ్వకుంటే వాటిని కూల్చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవారని పేర్కొన్నారు. విషయాన్ని గ్రహించిన కలెక్లర్ సరదు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్వర రెడ్డిని సస్పెండ్ చేశారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యేవరకు హెడ్ క్వాటర్స్ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు జారీచేశారు కలెక్టర్.
ఇది కూడా చూడండి:Electric shock: తో నాలుగు ఏనుగులు మృతి