అన్నమయ్య: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ ఈనెల 28వ తేదీన ప్రజా ఉద్యమ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు గోవిందరెడ్డి పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి కార్యాలయం వద్ద ప్రజా ఉద్యమ పోస్టర్లను రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి శివ, ఛైర్మెన్ ఆధ్వర్యంలో విడుదల చేశారు.