NLR: ఆత్మకూరు మండలం నారంపేట వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారి పక్కన శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.