HYD: వృద్ధులు, దివ్యాంగుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే సదుపాయం అమలు చేస్తుంది. ఇందుకోసం 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఫారం-12డీకి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.3లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేడు సాయంత్రం వరకు దరఖాస్తు అందించాలన్నారు.