ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలాన్లు (Traffic Challan) తిప్పలు తెచ్చి పెట్టాయి. ఏకంగా జైలు పాలు చేశాయి. కేరళకు ( Kerala ) చెందని ఓ వ్యక్తి హెల్ మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. దీంతో ట్రాఫిక్ సీసీ కెమెరాలు క్లిక్ మనిపించాయి. సదరు వెహికిల్ నెంబర్ అతని భార్య మొబైల్ కు యాడ్ అయి ఉండటంతో మెసేజ్ అతని భార్యకు వెళ్లింది. మెసేజ్ ను గమనించిన అతని భార్య … భర్త వెనక ఓ మహిళ కూర్చుని ఉండటంతో ఆగ్రహానికి గురైంది. ఇంటికి వచ్చిన భర్తను సదరు మహిళ ఎవరని ప్రశ్నించింది. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని లిఫ్ అడిగితే ఇచ్చానని భర్త చెప్పాడు. దంపతుల మధ్య ఈ విషయం వాగ్వాదానికి దారితీసింది. ఈ ఘటన ఏప్రిల్ 25న జరిగింది. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
భర్తను అనుమానించిన భార్య తనను, తమ మూడేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె మే 5న కరమన పోలీసులకు ఫిర్యాదు చేసింది. “ఆమె వాగ్మూలం ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఐపీసీ 321 ( స్వచందంగా గాయపరచడం), 341 (తప్పు నిర్బంధం), 294 (అశ్లీల చర్యలు), బాల్య న్యాయ చట్టం సెక్షన్ 75 ( పిల్లలపై దాడి ) కింద అరెస్ట్ చేసాము” అని పోలీసు ( Kerala Police ) అధికారి తెలిపారు. భర్తను కోర్టుముందు హాజరు పరిచామని, కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని చెప్పారు. అయితే భర్త వెనకాల కూర్చున్న మహిళ ఎవరన్నది ఇప్పటివరకు తెలువదు. నిజంగానే భర్త గుర్తు తెలియని మహిళకు లిఫ్ట్ ఇచ్చాడా లేదా అతనికి తెలిసిన మహిళేనా అనేది రహస్యంగానే ఉండిపోయింది.